అటు మరణాలు, ఇటు పాజిటివ్ కేసులు... ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉగ్రరూపం

  • 2 వేలు దాటిన కరోనా మరణాలు
  • కొత్తగా 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు
  • 9,097 మంది డిశ్చార్జి
ఏపీలో మరోసారి పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు సంభవించాయి. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 97 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది చనిపోయారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు చోటుచేసుకోగా, మొత్తం కరోనా మృతుల సంఖ్య 2,036కి పెరిగింది. ఇక, కొత్తగా 10,820 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,860కి చేరింది. తాజాగా మరో 9,097 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 87,112 మంది చికిత్స పొందుతున్నారు.

Corona Virus
Andhra Pradesh
Districts
Deaths
Positive Cases

More Telugu News